Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

నా వాళ్లు ఎవరనేది నాకు అర్థమైంది: నటుడు నోయల్ 

Noel Interview
Advertisement
  • లవ్ బ్రేకప్ చాలా బెటరన్న నోయెల్ 
  • పెళ్లి తరువాత విడిపోకూడదని వ్యాఖ్య 
  • ఫ్యామిలీస్ ఎఫెక్ట్ అవుతాయని వెల్లడి
  • ఆమెని తానెప్పుడూ ఏమీ అనలేదని వివరణ  

Advertisement
నోయల్ .. నటుడిగా నిలదొక్కుకోవడానికి గట్టిగా కృషి చేస్తున్నాడు. ఇంతవరకూ చేసిన సినిమాల వలన తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకున్నాడు. వైవాహిక జీవితంలో ఒడుదుడుకులు ఎదురైనా, ఆయన ఆ విషయాన్ని హైలైట్ చేయకుండా తన పని చేసుకుంటూ వెళుతున్నాడు. తాజాగా ఐ డ్రీమ్ వారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించాడు. 

"నా లైఫ్ లోకి వచ్చిన తన విషయంలో నేను పాజిటివ్ గానే ఉండేవాడిని. ఈ ప్రపంచంలో అందరూ మంచివాళ్లే... అందరూ నా వాళ్లే అనుకునేవాడిని. కానీ తను ఒక ఇంటర్వ్యూలో నా  గురించి చెప్పగానే, నాతో ఉండేవాళ్లంతా ఒక్కసారిగా మాయమైపోయారు. నేను ఒప్పుకున్న సినిమాలు కూడా చేజారిపోయాయి. అప్పుడు జీవితమంటే ఏమిటనేది నాకు అర్థమైంది. కాకపోతే నా చుట్టూ క్లీన్ చేసిందిలే అనుకుని హ్యాపీగానే ఫీలయ్యాను" అని అన్నాడు. 

" ఆ సంఘటన తరువాత నాతో ఉన్నవాళ్లే నా వాళ్లని నాకు అర్థమైంది. నేను టార్చర్ చేశానని తను చెప్పినప్పటికీ, మా జర్నీ చాలా బ్యూటిఫుల్ గా సాగిందనే నేను చెబుతాను. మనం నిజంగా ఎవరినైనా ప్రేమిస్తే, వాళ్లను మనం ఏమీ అనలేము... నేనూ అంతే. నాపై తనకి ప్రేమ లేకపోవచ్చు... కానీ నాకు ప్రేమ ఉంది. లవ్ బ్రేకప్ చాలా బెటర్... ఇద్దరికి మాత్రమే బాధ ఉంటుంది. పెళ్లి అయిన తరువాత విడిపోతే ఫ్యామిలీస్ చాలా ఎఫెక్ట్ అవుతాయి" అని చెప్పాడు. 

Advertisement
Advertisement
Noel
Actor
Tollywood

More Telugu News